భద్రాద్రి జిల్లాలోని గ్రామపంచాయతీలకు ఆర్థిక కష్టాల నుంచి విముక్తి లభించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసింది. జిల్లాలోని 471 పంచాయతీలకు మొదటి విడతగా రూ.11.90 కోట్లు రాగా, తాజాగా మరో రూ.17.85 కోట్లు ఖాతాల్లో జమ అయ్యాయి.