KMM: నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి గ్రామంలో గురువారం విషాదం నెలకొంది. వేర్వేరు కారణాలతో గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకేరోజు మరణించడంతో స్థానికంగా శోకసముద్రం నిండింది. గ్రామానికి చెందిన తాళ్ళూరి అంజయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయగా.. పెడల్లి రుక్మిణమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఒకే గ్రామంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం విషాదచాయాలు అలుముకున్నాయి.