NLG: చిట్యాల పురపాలిత పరిధిలోని వెంకటాపురం అంగన్వాడీ టీచర్‌గా 23 ఏళ్ల పాటు విశేష సేవలు అందించిన పుష్పావతి బుధవారం ఆకస్మికంగా మృతి చెందారు. మూడు నెలల క్రితమే ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆమె మృతి పట్ల తోటి అంగన్వాడీ టీచర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. పుష్పావతి కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలిపారు.