NDL: డోన్ మండలం కొత్తబుర్జులో ఈ నెల 9న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో బుధవారం MLA కోట్ల జయసూర్య ప్రకాశ రెడ్డి సభా స్థలం, హెలిప్యాడ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభకు వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.