NLG: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక నిర్వహణపై ఈనెల 6న నల్గొండలో ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం జరగనుంది. ఉమ్మడి జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. 99 రోజులపాటు జరిగే ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై చర్చించనున్నారు. సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు.