TG: సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్కు బయలుదేరారు. ఈ పర్యటనలో ప్రధానంగా తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను అధిష్ఠానంతో చర్చించి కొలిక్కి తెచ్చారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం.. రాష్ట్రానికి అదనపు ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం మరిన్ని పోస్టుల ఆవశ్యకతను ఆయన వివరించారు.