కృష్ణా: కానూరుకు చెందిన వాసిపల్లి కళ్యాణ్ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ ఈనెల 2వ తేదీ రాత్రి ఇద్దరు స్నేహితులతో బార్‌కు వెళ్లాడు. ఎదురుటేబుల్ వద్ద మద్యం మత్తులో కొందరు గొడవపడటాన్ని చూసి కళ్యాణ్ సర్దిచెప్పేందుకు వెళ్లాడు. ఆగ్రహించిన నలుగురు బీరు సీసాతో దాడి చేయడంతో తల, ముఖంపై గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.