KMM: పెళ్లైన మూడు నెలలకే ఆ ఇంట్లో హోలీ పండుగ తీరని శోకాన్ని నింపింది. ఏన్కూరుకు చెందిన మల్లు సాయి బుధవారం స్నేహితులతో కలిసి హోలీ ఆడుతూ సరదాగా ఈత కోసం కాలువలోకి దిగాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. సాయి మరణంతో భార్య, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై ఎస్సై సంధ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.