BDK: చుంచుపల్లి ప్రశాంతినగర్‌లో చోటుచేసుకున్న భూవివాదంపై విచారణకు వెళ్లిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన పులిచెర్ల ఆదిత్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు 2 టౌన్ సీఐ ప్రతాప్ తెలిపారు. విచారణ సమయంలో పోలీసులపై తిరగబడి, అనుచితంగా ప్రవర్తించినందుకు ఈ చర్య తీసుకున్నామన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించితే చర్యలు తప్పవని హెచ్చరించారు.