GNTR: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొలనుకొండ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. తెనాలి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుమారు 40 సంవత్సరాల వయసున్న వ్యక్తి విజయవాడ వైపు వెళ్లే రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని వద్ద ఆధారాలు ఏమీ లభించలేదని, ఆచూకీ తెలిసినవారు తమను సంప్రదించాలని జీఆర్పీ ఎస్స్సై సరస్వతి కోరారు.