PDPL: రామగుండం గౌతమి నగర్‌కు చెందిన కొప్పుల రాజయ్య రెండు నెలల క్రితం ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ఉన్న తన కుమారుడు ప్రసాద్ వద్దకు భార్యతో కలిసి వెళ్ళాడు. అయితే, ఈ నెల 3న గుండెపోటుతో రాజయ్య మరణించాడు. ఈ మేరకు రాజయ్య మృతదేహం గౌతమి నగర్‌లోని ఇవాళ ఆయన సొంత ఇంటికి చేరుకుంది. సంతోషంగా వెళ్లిన ఆ కుటుంబంలో రాజయ్య విగత జీవిగా రావడంతో కాలనీలో విషాదం అలుముకుంది.