NRPT: ఉట్కూర్ మండలం పెద్దజట్రలో సోమవారం సర్పంచ్ వాకిటి వెంకటేశ్ ఆధ్వర్యంలో నర్సరీ, పల్లె ప్రకృతి వనంలో శ్రమదానం నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చెత్త, ముళ్లపొదలను తొలగించి ప్రాంతాన్ని శుభ్రం చేశారు. సేకరించిన వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలిస్తామని సర్పంచ్ తెలిపారు. ఉప సర్పంచ్ స్వాతి, కార్యదర్శి బబిత, వార్డు సభ్యులు కూడా పాల్గొన్నారు.