ATP: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఎమ్మెల్యే పరిటాల సునీత సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ నూతన భవనాల నిర్మాణాలకు 6.70 కోట్ల నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే రాప్తాడు నియోజకవర్గంలోని నూతన, అసంపూర్తి దేవాలయాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు.