AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఆరోగ్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. మంచి అలవాట్ల వల్ల అనారోగ్యం మన దరి చేరదని వెల్లడించారు. యోగా, ధ్యానం వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మనం తినే ఆహారమే.. మన ఆరోగ్యాన్ని రక్షిస్తుందని చెప్పారు.