NZB: చందూరు మండలంలోని ఘన్పూర్ గ్రామంలో బీసీ యూత్ ఆధ్వర్యంలో ఇవాళ ఉపాధి హామీ కూలీలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి హామీ కూలీలు తెల్లవారుజామున కూలి పని చేసేందుకు వస్తున్నారని, అందుకే ఈ ఏర్పాటు చేసినట్లు యూత్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘన్పూర్ బీసీ యూత్ సభ్యులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.