MNCL: శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ గనిలో హ్యామర్మ్యాన్గా పనిచేస్తూ ప్రమాదంలో శాశ్వత దివ్యాంగుడైన సత్యనారాయణకు యూనియన్ బ్యాంక్ ద్వారా రూ.కోటి బీమా సొమ్ము అందజేశారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జీఎం ఎం.శ్రీనివాస్, బ్యాంక్ సీజీఎం అపర్ణా రెడ్డి చేతుల మీదుగా చెక్కును పంపిణీ చేశారు. సూపర్ సాలరీ అకౌంట్ ప్రయోజనాలపై అధికారులు అవగాహన కల్పించారు.