E.G: దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి డ్యామ్‌లో మునిగి మృతి చెందారు. మృతులను తుమ్మల నాగరాజు, రమణగా గుర్తించినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. గుబ్బల మంగమ్మ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఘటన నెలకొంది.