బాపట్ల జిల్లా నగరం కొత్త ఎస్‌హెచ్‌వోగా ఎస్ఐ చెన్నకేశవులు బుధవారం బాధ్యతలు చేపట్టారు. స్టేషన్ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణే తన తొలి ప్రాధాన్యతని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తానని స్పష్టం చేశారు.