PPM: సీతంపేటమండలం దాసుగుమ్మడ నుంచి అంబలిగండివెళ్లే రహదారి రాళ్లు తేలి అధ్వానంగా దర్శనమిస్తోంది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే గిరిజనులు అవస్థలు పడుతున్నారు. అటవీ ఉత్పత్తులు మార్కెట్‌కు తరలించడానికి, రోగులను అంబులెన్స్‌లో ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి నరకం చూస్తున్నారు. వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.