VSP: శ్రీహరిపురం జీవీఎంసీ వాణిజ్య సముదాయంలో దుకాణదారులు ఆందోళన చేపట్టారు. ఏళ్లుగా అద్దెలు చెల్లిస్తూ దుకాణాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్కింగ్ లేకుండా కాయగూరలు, పండ్ల బండ్లు ఉండడంతో వ్యాపారం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. 60 దుకాణాల్లో 30 ఖాళీగా ఉండటంతో జీవీఎంసీకి సంవత్సరానికి రూ.40 లక్షల నష్టం వస్తోందని ఆరోపించారు.