KNR: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ఉద్యమించనున్నట్లు STU రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ వెల్లడించారు. ఆదివారం కరీంనగర్లో జరిగిన జిల్లా శాఖ ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని, ఫిబ్రవరి 5న ఢిల్లీలో చేపట్టనున్న ‘మార్చ్ టు పార్లమెంటు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.