SRD: బీరంగూడ గుట్టపై నిర్మించనున్న శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి ఆలయ తొలి స్లాబ్ పనులను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం ప్రత్యేక పూజల చేసి ప్రారంభించారు. రూ.3 కోట్ల అంచనా వ్యయంతో ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలంతా భాగస్వాములు కావాలని, యువత భక్తిభావం పెంపొందించుకోవాలని కోరారు. సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.