NRML: భైంసా పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. పట్టణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ.28 కోట్ల నిధులు మంజూరయ్యాయని, మహాదేవ్ చెరువు ఆధునీకరణకు రూ.2.14 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. భైంసా రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని ఆయన పేర్కొన్నారు.