SRCL: కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో బుధవారం శ్రీగోదా రంగనాయకస్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణాన్ని తిలకించి తరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంఛార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు దంపతులు పాల్గొన్నారు.