CTR: ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైన సంఘటన చౌడేపల్లి మండలం చుక్క వారి పల్లెలో బుధవారం జరిగింది. గ్రామంలోని మురళి ఇంటి వద్ద ప్రమాదం జరిగింది. దీంతో పుంగనూరు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది అక్కడికి చేరుకొని స్థానికుల సాయంతో మంటలు అదుపు చేసినట్లు తెలిపారు. గడ్డివామి సమీపంలోనే కారు ఉండగా దానికి ఎటువంటి నష్టం జరగలేదన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.