AKP: సంక్రాంతి సందర్భంగా కోటవురట్ల మండలం కైలాసపట్నం రాజగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. పలువురు మహిళలు పోటీల్లో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డివి సూర్యనారాయణ రాజు విజేతలకు బహుమతులు అందజేశారు. నియోజకవర్గం వైసిపి సోషల్ మీడియా కన్వీనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.