VSP: మధురవాడ బొట్టవానిపాలెం గ్రౌండ్లో సంక్రాంతి సందర్భంగా బీపీఎల్ సీజన్–6 బుధవారం ప్రారంభమైంది. కార్పొరేటర్ మొల్లి హేమలత, టీడీపీ నేత మొల్లి లక్ష్మణరావు టోర్నీని ప్రారంభించారు. క్రీడలు యువతకు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం ఇస్తాయని తెలిపారు. నాలుగు రోజుల టోర్నీలో ఐదు జట్లు పాల్గొంటున్నాయి.