MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ శివారులోని రామప్ప గుట్ట పై వెలసిన స్వయంభు శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించగా, సాయంత్రం గ్రామం నుంచి ఎడ్లబండ్ల ఊరేగింపు నిర్వహించారు. ఆలయం వద్ద ఎడ్లబండ్లకు పూజలు నిర్వహించి గుడి చుట్టూ తిప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.