ADB: ఆదిలాబాద్ మండలం ఛిద్దరి ఖానాపూర్లో బుధవారం గ్రామస్థులు సామూహిక క్రీడా పోటీలు నిర్వహించారు. పండుగ వేళ సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ముగ్గులు, పరుగు పందాల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐక్యతను చాటేందుకే ఈ వేడుకలని గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాణి భీమ్రావు, గ్రామ పెద్దలు దివాకర్ నాయక్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.