NLG: చిట్యాల మండలం వెలిమినేడులో సంక్రాంతి కానుకగా గ్రామానికి చెందిన నాతి శ్రీనివాస్ బుధవారం మహిళలకు మంచినీటి క్యాన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై సేవా కార్యక్రమానికి పూనుకున్న దాతను అభినందించారు. ఫిల్టర్ వాటర్‌ను నిలువ చేసుకునేందుకు వాటర్ క్యాన్లతో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.