RR: చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని దామరగిద్ద 10వ వార్డులో నీటి సమస్య నెలకొంది. దీంతో స్పందించిన చేవెళ్ల మాజీ సర్పంచ్ ఆగిరెడ్డి, PACS మాజీ ఛైర్మన్ దేవర వెంకటరెడ్డి సొంత నిధులు వెచ్చించి బోరు మోటారు వేయించారు. సమస్యకు స్పందించి నీటి ఇబ్బందిని తీర్చడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. సమస్యలను తీర్చడంలో ఎల్లప్పుడూ ముందుంటామన్నారు.