PPM: రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన శంబర పోలమాంబ జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారిని సోమవారం గ్రామంలోకి తీసుకురానున్నారని ఆలయ ఛైర్మన్ పూడి దాలినాయుడు తెలిపారు. సంప్రదాయం ప్రకారం అమ్మవారికి ఆలయ ఛైర్మన్, EO, గ్రామ పెద్దలు, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.