VZM: కోమాలో ఉన్న మహిళా కానిస్టేబుల్ నాగమణి కుటుంబాన్ని ఆదుకునేందుకు జిల్లా పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. తోటి సిబ్బంది సేకరించిన 1,10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ బాధిత కుటుంబ సభ్యులకు ఆదివారం అందజేశారు. మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న నాగమణి అనారోగ్యంతో విశాఖలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.