PLD: మాచవరం మండల కేంద్రంలోని జీకే పబ్లిక్ స్కూల్లో ఆదివారం విద్యార్థినులు ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. నెమలి,పూర్ణ కుంభం వంటి రంగురంగుల ముగ్గులు వేసి తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రిన్సిపాల్ గంధం శ్యామ్ కుమార్ విద్యార్థినులను అభినందించి, ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.