NLG: శాలిగౌరారం మండలం ఉప్పులంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ దివంగత బండారు మల్లయ్య విగ్రహాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సామేలు కలిసి ఆదివారం ఆవిష్కరించారు. మల్లయ్య కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు మరువలేనివని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.