BHPL: మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీనగర్‌లో కాలనీవాసుల సహకారంతో ఏర్పాటు చేసిన CC కెమెరాలను ఇవాళ MLA గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని, సీసీ కెమెరాల ద్వారా నేరాల నియంత్రణతో పాటు శాంతిభద్రతలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.