ASF: సిర్పూర్ (టీ) పట్టణం జడ్పీ హైస్కూల్లో స్థానిక యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10-10 క్రికెట్ టోర్నమెంట్ ను SI సురేష్ ఇవాళ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా SI మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని అందిస్తాయని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడల పట్ల ఆసక్తి చూపాలని కోరారు.