ప్రకాశం: కనిగిరి డీఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ తన కార్యాలయంలో ఆదివారం డివిజన్ స్థాయిలో ఎస్సైలతో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆయన సూచించారు. కేసులను సకాలంలో పరిష్కరించడానికి అవసరమైన సూచనలు జారీ చేశారు. అనంతరం పట్టణంలోని వివిధ లాడ్జిలలో తనిఖీలు నిర్వహించారు.