SKLM: కాశీబుగ్గ ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన వేళ చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి సీసీ కెమెరా వైర్లను తొలగించి ఆపై చోరీకి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కాశిబుగ్గ డీఎస్పీ షేక్ సహబాజ్ అహమ్మద్ ఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.