కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి గురువారం భీమవరం వాస్తవ్యులు పెరిచర్ల వెంకట కృష్ణంరాజు, సత్యవాణి దంపతులు వారి కుటుంబ సభ్యులు రూ.1, 00,116 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.