KRNL: మకర సంక్రాంతి సందర్భంగా శివనగర్‌లో డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, యూటీఎఫ్, సీఐటీయూ, చేనేత సంఘం ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు శుక్రవారం నిర్వహించారు. డీవైఎఫ్ఐ నాయకులు రవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నేతలు క్రీడల ప్రాధాన్యతను వివరించారు. కబడ్డీ యువతలో ఆత్మవిశ్వాసం పెంచుతుందన్నారు. మొదటి బహుమతి శివశంకర్ టీం, రెండో బహుమతి ఉదయ్ టీం గెలుచుకున్నాయి.