WGL: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలో పశువుల అందాల పోటీలను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానుకోట ఎంపీ బలరాం నాయక్, స్థానిక MLA దొంతి మాధవ రెడ్డిలు ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీలను వారు ఆసక్తిగా తిలకించారు. అంతరించిపోతున్న కళలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు సూచించారు.