HYD: దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నియంత్రణలో సమర్థ చర్యలు తీసుకున్నందుకు కేంద్రం నుంచి ప్రశంసలు లభించాయి. 2024లో నగరంలో 2806 డెంగ్యూ కేసులు నమోదుకాగా, 2025లో ఇవి 1977కే పరిమితమయ్యాయి. ప్రత్యేక ఫాగింగ్, లార్వా నియంత్రణ, పారిశుద్ధ్య చర్యల వల్ల డెంగ్యూ కేసులు భారీగా తగ్గుముఖం పట్టినట్లు అధికారులు తెలిపారు.