ముగ్గు కేవలం తెలుగింటి ఆడపడుచులకు సంప్రదాయం మాత్రమే కాదు.. వారిలోని ఒక సృజనాత్మకత. నేటితరం అమ్మాయిలు ముగ్గులను కేవలం వాకిలికే పరిమితం చేయకుండా SM వేదికగా తమ టాలెంట్‌ను చాటుతున్నారు. సంప్రదాయ రంగవల్లికలకు ఆధునిక అంశాలను జోడించి నెట్టింట షేర్ చేస్తున్నారు. చుక్కల ముగ్గుతో మొదలైన ఈ ప్రయాణం నేడు లైకులు షేర్ల ద్వారా పండగ కళను ప్రపంచవ్యాప్తంగా అందిస్తోంది.