W.G: నరసాపురంలోని రుస్తుంబాద క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన 31వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మేటి జట్లు ఈ టోర్నీలో తలపడుతుండటంతో క్రీడా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. గురువారం ఆంధ్రా, తమిళనాడు జట్ల మధ్య మ్యాచ్ జరిగాయి. ఈ పోటీలను వీక్షించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.