రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం రికార్డుల వేట మొదలుపెట్టింది. ఈ మూవీలోని ‘రై రై రా రా’ పాట విడుదలైన 24 గంటల్లోనే 46.1 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. విశేషమేమిటంటే, రెండో స్థానంలో కూడా ఇదే సినిమాలోని ‘చికిరి చికిరి’ (29.19 మిలియన్ వ్యూస్) నిలిచింది. మూడో స్థానంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలోని ‘దేఖ్లేంగే సాలా’ నిలిచింది.