VSP: సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో ఇవాళ చక్రవర్తి తిరుమగన్ తిరునక్షత్రం (వైష్ణవ శ్రీరామ నవమి) పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు చాలా వైభవంగా చేపట్టారు. అర్చకులు స్వామి వారికి అభిషేకం నిర్వహించి, శ్రీరాముని కీర్తిస్తూ దివ్య ప్రబంధాల పఠించారు. ఈ పూజల నేపథ్యంలో ఈరోజు ఆలయంలో జరిగే అన్ని అర్జీత సేవలు రద్దు చేశారు.