ASR: కొయ్యూరు మండలంలో 7,421 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్దిదారులకు రూ.3,11,68,000 సొమ్ము మంజూరైనట్లు ఎంపీడీవో ప్రసాదరావు ఇవాళ తెలిపారు. ఈనెల 30న పెన్షన్ సొమ్మును బ్యాంకుల నుంచి విత్ డ్రా చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. మే నెల 1 ఉదయం నుంచి లబ్దిదారులకు పెన్షన్లను పంపిణీ చేయాలన్నారు. లబ్ధిదారులందరూ ఇళ్ల వద్దే అందుబాటులో ఉండి సహకరించాలని కోరారు.