MBHR: అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని మహబూబ్నగర్ మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ అన్నారు. శనివారం మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 46వ డివిజన్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ పలు సమస్యలను విన్నవించగా, డివిజన్లో CC రోడ్లు డ్రైనేజీలు మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు.