MDK: చేగుంట మండలంలో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షానికి కర్నాల్ పల్లి, మక్కరాజుపేట్, గొల్లపల్లి, రాంపూర్, కన్యారం గ్రామాలతో పాటు చేగుంట, నార్సింగి మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వయంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పండించిన పంట క్షణాల్లో నేలమట్టం కావడం బాధాకరమన్నారు.